ఆంధ్రప్రదేశ్ గ్రేడ్ 7 డిసెంబర్ కార్యాచరణ – నా కలల దేశం
లక్ష్యాలు
- ఒక కల్పిత దేశానికి నియమాలను రూపొందించడం ద్వారా రాజ్యాంగం యొక్క అర్థాన్ని క్లుప్తంగా అర్థం చేసుకోవడం.
నైపుణ్యాలు
కమ్యూనికేషన్, సృజనాత్మకత
విలువలు
బాధ్యత
హోంవర్క్ /ఇంటి పని కోసం సూచనలు
అంచనా సమయం: 10 నిమిషాలు.
- ఉపాధ్యాయులు విద్యార్థులను ఈ క్రింది ప్రశ్నలను అడుగుతారు:
- పాఠశాలలో మనం పాటించే కొన్ని నియమాలు ఏమిటి?
- ఏయే చోట్ల మనం పాటించాల్సిన నియమాలు ఉన్నాయి? (ఇల్లు, ఆసుపత్రులు మొదలైనవి)
- ఈ నియమాలు మనకు ఎందుకు అవసరమని మీరు అనుకుంటున్నారు?
- మన దేశానికి అలాంటి నియమాలు ఏమైనా ఉన్నాయా? ఈ నిబంధనలు(రూల్స్) ఎక్కడ రాశారు?
1-2 ప్రతిస్పందనలను తీసుకోండి మరియు వాటిని సంక్షిప్తీకరించండి.
- "కళ్ళు మూసుకుని మీరు కావాలనుకునే మీ సొంత కలల దేశాన్ని ఊహించుకోండి. మీ మనసులో ఆలోచించండి - మీ దేశం పేరు ఏమిటి? అక్కడ ఎలాంటి మనుషులు నివసిస్తున్నారు? అక్కడ వాతావరణం ఎలా ఉంది?" కొన్ని సెకన్ల పాటు కళ్ళు మూసుకొమ్మని చెప్పండి, ఆపై కళ్ళు తెరవమని వారికి చెప్పండి – ఇంట్లో ఒక చిన్న పని చేద్దాం, అక్కడ మన కలల కల్పిత దేశానికి నియమాలు కల్పిద్దాం.
- బోర్డుపై అండర్ లైన్ చేయబడ్డ పదాలను రాయడం ద్వారా ఆఫీస్ బేరర్ ల సహాయంతో హోంవర్క్ పనిని వివరించండి.
- వారి కలల దేశానికి పేరు పెట్టండి.
- ప్రపంచ పటంలో మీ దేశం యొక్క ఆకారం గీయండి, స్థానాన్ని చూపండి మరియు దేశం యొక్క జెండాను రూపొందించి, వాతావరణం/పరిస్థితిని గురించి వివరించండి.
ఆ దేశ ప్రజల గురించి రాయండి (ఎంత మంది ప్రజలు, లింగ పరంగా- పురుషుడు/స్త్రీ, ఎలాంటి వ్యక్తులు(వృద్ధులు, యువకులు), వారు ఎలా ప్రవర్తిస్తారు (సంతోషంగా, కోపం), ఎలా అనుభూతి చెందుతారు, మొదలైనవి.
- దేశంలోని ప్రతి వ్యక్తి పాటించాల్సిన కనీసం 3 నియమాలను రాయండి. ఉదాహరణకు – ప్రతి ఒక్కరితో గౌరవంగా మరియు దయతో వ్యవహరించండి.
హోంవర్క్ టాస్క్
విద్యార్థులు గుర్తుంచుకోవలసిన విషయాలు:
- అందుబాటులో ఉన్న షీట్/నోటుపుస్తకాన్ని ఉపయోగించండి.
- హోంవర్క్ టాస్క్ లలో ఇవ్వబడ్డ అన్ని అంశాలు- దేశం పేరు, దేశం ఆకారం, జెండా, వాతావరణం, జనాభా మరియు 3 నియమాలు ఉండేలా చూసుకోండి.
ఆఫీస్ బేరర్లు 'నా కలల దేశం - ఒక పేజర్‌ని దేశ్ అప్నాయెన్ వాల్‌లో రొటేషన్ ప్రాతిపదికన ప్రతి ఒక్కరూ ఒకరి ప్రతిస్పందనను మరొకరు చూసేలా ప్రదర్శించగలరు. విద్యార్థులు పూర్తి చేసిన హోంవర్క్‌ని తీసుకురావడానికి దయచేసి రీక్యాప్ తేదీని ముందుగా తెలియజేయండి.
కార్యాచరణ ముగింపు(దీపావళి సెలవుల తర్వాత చేయాలి)
అంచనా సమయం: 15 నిమిషాలు
2 నుండి 3 మంది విద్యార్థులు తమ కలల దేశాన్ని ప్రదర్శించడానికి సిద్ధంగా ఉండాలని ఆఫీస్ బేరర్ చెబుతారు. విద్యార్థులు స్వచ్ఛందంగా ముందుకు రావాలని, ఎవరూ ముందుకు రాకపోతే విద్యార్థులను ఎంపిక చేసి ముందుగానే తెలియజేయవచ్చు. ఇది ఒక వ్యక్తికి 2 నుండి 3 నిమిషాల ప్రజంటేషన్ గా ఉంటుంది. కనీసం ఒక ఆఫీస్ బేరర్ ఉండాలి.
1 లేదా 2 విద్యార్థులను చెప్పమనండి - (మీకు గుర్తు లేకపోతే, మీరు చిట్టీలు చేయవచ్చు.)
- మీ దేశం కోసం నియమాలను రూపొందించిన అనుభవం ఎలా ఉంది?
- దేశం కోసం నియమాలు రూపొందించడం ఎందుకు ముఖ్యమని మీరు అనుకుంటున్నారు?
- నిబంధనల పుస్తకం (రాజ్యాంగం) యొక్క ఉద్దేశ్యం ఏమిటని మీరు అనుకుంటున్నారు? (విద్యార్థులు సమాధానం చెప్పలేకపోతే ఉపాధ్యాయుడు సారాంశంలో సమాధానం ఇవ్వగలడు)
ఉపాధ్యాయులు కార్యచరణ కోసం కీలకమైన లెర్నింగ్ పాయింట్లను సంగ్రహిస్తారు
- నియమాలను సృష్టించిన అనుభవం నుండి, వాటిని సృష్టించడం సులభం కాదని మేము తెలుసుకున్నాము, కానీ ఇది మాకు యాజమాన్య భావాన్ని కూడా ఇచ్చింది.
- దేశంలో శాంతిభద్రతలు, క్రమశిక్షణ పాటించడానికి, ప్రతి ఒక్కరినీ రక్షించడానికి నిబంధనలు దోహదపడతాయి.
- దేశ నియమాలు, చట్టాలను రచించిన పుస్తకాన్ని రాజ్యాంగం అంటారు. అందరికీ ఒకే నియమాలు వర్తించే విధంగా అందరినీ సమానంగా చూడటానికి ఇది సహాయపడుతుంది.
దేశ్ అప్నాయెన్ వాల్
ఈ కార్యాచరణ కోసం, కింది వాటిని వాల్ పై ఆఫీస్ బేరర్లు అప్‌డేట్ చేయవచ్చు.
- నా కలల దేశం ఒక్క పేజర్ను ఎవరు స్వచ్ఛందంగా పంచుకోవాలనుకుంటున్నారో, రోజువారీగా వీలైనంత ఎక్కువగా ఎవరు షేర్ చేయాలనుకుంటున్నారో ఆఫీస్ బేరర్లు అడగవచ్చు.
గమనించవలసిన అంశాలు
- విద్యార్థులు హోంవర్కు చేయాల్సి ఉంటుంది కాబట్టి వారు అన్ని సబ్జెక్టులను రాశారని నిర్ధారించుకోండి.
- నా కలల దేశం హోంవర్క్ కోసం అలంకరణ కోసం ఫ్యాన్సీ వస్తువులను కొనడానికి విద్యార్థులు డబ్బు ఖర్చు చేయవద్దని వారికి చెప్పండి.
- అనుబంధం 1 ను విద్యార్థులకు చూపించవచ్చు లేదా ఇవ్వవచ్చు. విద్యార్థులు తమ సృజనాత్మకతకు అనుగుణంగా ప్రెజెంట్ చేసుకునే స్వేచ్ఛ ఉంటుంది.
కార్యాచరణ ఫోటోలను భాగస్వామ్యం చేయడం
- కార్యాచరణ ఫోటోల కొరకు, దయచేసి వీటి యొక్క స్పష్టమైన చిత్రాలను భాగస్వామ్యం చేయండి
- హోమ్-ఇన్స్ట్రక్షన్స్ సెషన్ చిత్రం (2 చిత్రాలు)
- విద్యార్థులు ప్రదర్శిస్తున్న దృశ్యం ఆఫీస్ బేరర్ ద్వారా రీక్యాప్ (సారాంశం) సెషన్ దృశ్యాలు. (2 ఫోటోలు)
- దేశ్ అప్నాయెన్ వాల్ ఫోటోలు (2 ఫోటోలు)
అనుబంధం
అనుబంధం 1 – రిఫరెన్స్ మెటీరియల్స్
గమనిక: విద్యార్థులు తమ సృజనాత్మకతకు అనుగుణంగా పై సమాచారాన్ని స్వేచ్ఛగా అందించే మార్గదర్శక చిత్ర పటం ఇది. గ్రూప్ టాస్క్ లో పేర్కొన్న అన్ని అంశాలను చేర్చేలా జాగ్రత్తలు తీసుకోవాలి.
రిఫరెన్స్ కొరకు ప్రపంచ పటం యొక్క చిత్రం:
ఇమేజ్ మూలం: https://www.123rf.com/photo_36235529_cartoon-world-map.html