ఆంధ్రప్రదేశ్ గ్రేడ్ 6 మార్చి కార్యాచరణ – పనిభారాన్ని పంచుకోండి
ఉద్దేశ్యాలు
- ఇంటి వద్ద బాధ్యతను పంచుకోవడంలోని ప్రాముఖ్యతను విద్యార్థులు గుర్తించగలుగుతారు.
- లింగ సమానత్వం అనేది ఇంటి నుండి మొదలై సమాజానికి వర్తిస్తుందని విద్యార్థులు గుర్తించగలుగుతారు.
ఫలితాలు
- విద్యార్థులు తమ సొంత మాటల్లో ఇంటి బాధ్యతలను పంచుకోవడంలో గల ప్రాముఖ్యతను నిర్వచించగలరు.
- విద్యార్థులు ఇంటి పనులను నిర్వహిస్తూ ఇంటి వద్ద బాధ్యతను ఎలా చేపట్టగలరో వివరిస్తారు.
నైపుణ్యాలు మరియు విలువలు
నైపుణ్యాలు - కమ్యూనికేషన్, సహకారం మరియు సృజనాత్మకత
విలువలు-సమానత్వం
అవసరమైన సామగ్రి
నోట్ బుక్స్, పెన్నులు
కార్యాచరణ దశలు
సెషన్ 1: 45 నిమిషాల సెషన్ కోసం సోపానాలు 1నుండి 3
సోపానము 1 - పరిచయం
సమయం: 10-12 నిమిషాలు
ఉపోద్ఘాత విభాగాన్ని ఉపయోగించి రోజుకి సంబంధించిన అంశంతో తరగతిని పరిచయం చేయండి.
నాటకంలోని పాత్రలను పోషించడానికి ఉపాధ్యాయుడు విద్యార్థులను ఎంపిక చేస్తారు. ఆమె అనుబంధం 1లో ఇచ్చిన స్క్రిప్ట్‌ని పంపిణీ చేస్తుంది మరియు దానిని సిద్ధం చేయడానికి వారికి 10 నిమిషాల సమయం ఇస్తుంది.
పాత్రల జాబితా:
1. అమ్మ
2. నాన్న
3. కుమారుడు
4. కుమార్తె
5. తాత
6. నానమ్మ
గమనిక: ఉపాధ్యాయుడు పాత్రలను కూడా గుర్తించవచ్చు మరియు పాత్రపోషణను ప్రదర్శించడానికి తరగతికి ముందు వారిని సిద్ధం చేయవచ్చు
సోపానము 2 - పాత్ర పోషణ లేదా వీడియో
అంచనా సమయం: 30 నిమిషాలు
1. ఉపాధ్యాయుడు విద్యార్థులకు పాత్రపోషణను ప్రదర్శించమని సమూహాన్ని అడుగుతారు.
2. తరువాత ఉపాధ్యాయుడు ఇతర విద్యార్థులను ఈ క్రింది ప్రశ్నలను అడుగుతారు.
i. పాత్ర పోషణ మీ పరిశీలనలు ఏమిటి?
ii. నాటకంలో కూతురితో మీరు ఏకీభవిస్తారా?
iii. మీరు మీ కుటుంబ సభ్యులతో పనిని పంచుకుంటున్నారా?
iv. మీరు మీ ఇంటిలో ఇంటి పనులను ఎందుకు పంచుకోవాలి?
3. ఇంటి పనులను పంచుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలపై చర్చతో సెషన్‌ను ముగించండి. ఇక్కడ మూడు ముఖ్యమైన అంశాలు ఉన్నాయి:
i. కుటుంబ విలువలపై బలమైన అవగాహన ఉంది, ఇది బంధాన్ని బలపరుస్తుంది మరియు కుటుంబ సభ్యుల మధ్య గౌరవాన్ని ప్రోత్సహిస్తుంది.
ii. కుటుంబం మొత్తం పరిస్థితిని ఎదుర్కోవడానికి సంసిద్ధంగా ఉంటుంది.
iii. బాధ్యతలను పంచుకోవడంలో అత్యంత ముఖ్యమైన ప్రయోజనం ఏమిటంటే ఇది ప్రతి కుటుంబ సభ్యునికి లోతైన ఆనందపు అనుభూతిని ఇంటికి తీసుకువస్తుంది.
సోపానము 3 - కృత్యము యొక్క వివరణ
సమయం: 5-7 నిమిషాలు
కృత్యమును వివరించడానికి విద్యార్థులను క్రింది ప్రశ్నలను అడగండి:
1. ఈ కృత్యము నుండి మీరు ఏమి నేర్చుకున్నారు?
2. ఇంట్లో పనులను పంచుకోవడానికి మీరు ఏ చర్యలు తీసుకుంటారు?
3. ఇంటి పనులే కాకుండా మీ చుట్టూ ఉన్న లింగ పరంగా అసమానతను మీరు ఎక్కడ చూస్తున్నారు? ఎందుకు?
ఇంటిపని: (5 నిమిషాలు)
ఇంట్లో వారు చూసే రోజువారీ పనుల జాబితాను తయారు చేయమని మరియు ఇంట్లో ఆ పనికి బాధ్యత వహించే సభ్యుని గుర్తించమని విద్యార్థులను అడగండి.
ఆలోచనల పత్రాలు మరియు అభిప్రాయ పత్రం
దయచేసి ఉపాధ్యాయులు అభిప్రాయ పత్రాన్ని పూరించాలి మరియు ఆలోచనల పత్రాలను పూరించమని విద్యార్థులకు కూడా గుర్తు చేయండి.
సూచిత విభాగము
అనుబంధం 1 - పాత్ర పోషణ స్క్రిప్ట్
నాటకంలోని పాత్రలను పోషించడానికి ఉపాధ్యాయుడు విద్యార్థులను ఎంపిక చేస్తారు. ఆమె స్క్రిప్ట్‌ని పంపిణీ చేస్తుంది మరియు సిద్ధం చేయడానికి వారికి 10 నిమిషాలు ఇస్తుంది.
పాత్రల జాబితా:
· అమ్మ
· నాన్న
· కుమారుడు
· కుమార్తె
· తాత
· నాయనమ్మ
నేపథ్యం: ప్రతి ఒక్కరూ తమ సొంత పనులు చేసుకుంటూ పనిలో లీనమైన దృశ్యం—అమ్మ కూరగాయలు కోసి భోజనం సిద్ధం చేస్తోంది, ఇంతలో ఆమె బూజు దులిపి, ఊడుస్తోంది, తాత మరియు నాయనమ్మలు బంధువుల పెళ్లి గురించి చర్చించుకుంటున్నారు, ఒక పిల్లవాడు షూ పాలిష్ అడుగుతున్నాడు మరియు మరొకరు తన టిఫిన్‌లో పాస్తా కోసం డిమాండ్ చేస్తున్నాడు, తండ్రి న్యూస్ పేపర్ చదువుతున్నారు. అమ్మ ఇంటి పనులన్నింటితో ఇబ్బంది పడుతోంది.(Not given in english version please check)
(సందర్భాన్ని సెట్ చేయడానికి ఉపాధ్యాయుడు నేపథ్యాన్ని చదవవచ్చు)
అమ్మ: ఈ రోజు, నేను బాగా ఆలస్యం అవుతున్నందున నేను బంగాళాదుంప కూర చేస్తాను.
(ఆమె తన పని చేయడం ప్రారంభించింది)
నాయనమ్మ: మాలా, నాకు దాహంగా ఉంది, దయచేసి నాకు కొంచెం మంచినీళ్ళు ఇస్తావా.
మాల(అమ్మ): తప్పకుండా!
(నాయనమ్మ కోసం అమ్మ నీరు తీసుకువస్తుంది)
తాత: మాలా కోడలా మాకు కొంచెం టీ కూడా ఇస్తావా?
మాల: అలాగే, మామగారు.
మాల కిచెన్ లోకి వెళ్ళింది.
మాల: గ్యాస్ మీద కూర మరియు పప్పు ఉడుకుతున్నాయి. వాటిలో ఏదైనా ఒకటి తీసివేసి నేను టీ చేయడం ప్రారంభిస్తే, నేను ఖచ్చితంగా పనికి ఆలస్యం అవుతాను.
నాయనమ్మ: కోడలా! టీ తయారు అయ్యిందా?
మాల: దయచేసి కొంచెం ఆగండి.
కుమారుడు: అమ్మా, ఈరోజు టిఫిన్‌లో నాకు పాస్తా ఇస్తున్నావా?
అమ్మ: లేదు, బాబూ! నేను ఈ వారాంతంలో నీకు పాస్తా ఇస్తాను. ఉదయం వేళల్లో అదనపు వంటకం చేయడం నాకు సాధ్యం కాదు
కుమారుడు: ఓహ్ లేదు! నువ్వు ఎప్పుడూ బిజీగానే ఉంటావు.
కుమార్తె: అమ్మా! షూ పాలిష్ నువ్వు ఎక్కడ పెట్టావు?
అమ్మ: ఇది షూ రాక్ లోపలనే ఉంది.
కుమార్తె: కానీ అది నాకు కనిపించలేదు!
అమ్మ: (షూ-రాక్ దగ్గరికి వెళ్లి, దానిని చూస్తుంది) అది ఇక్కడే ఉంది. అది ఇప్పుడు వాడుతున్న షూ వెనుక పడిపోయింది. నీకు ఇంకా కొంచెం ఎక్కువగా వెతికితే నీకే దొరికి ఉండేది.
నాన్న: ఓహ్! మాలా! త్వరగా లేవడానికి ప్రయత్నించు, తద్వారా నీవు నీ పనిని పూర్తి చేయవచ్చు!
అమ్మ: నేను ఇప్పటికే ఉదయం 5:30 గంటలకు లేస్తున్నాను, మీరందరూ ఉదయం 6:30 గంటలకు మేల్కొంటారు, నేను ఇప్పటికే ఒక గంట ముందుగానే లేస్తున్నాను.
నాన్న: అలాంటప్పుడు, నీ పనిని పూర్తి చేయడానికి నీవు ఉదయం 5:00 గంటలకు మేల్కోవాలని నేను భావిస్తున్నాను.
అందరూ (కుమార్తె తప్ప): అవును! నువ్వు పొద్దున్నే లేవాలి!
(అమ్మ విచారంగా ముఖం పెట్టింది)
కుమార్తె: ఆమె మాత్రమే పొద్దున్నే ఎందుకు మేల్కోవాలి? మనమందరం సాధారణ సమయం కంటే 10 నిమిషాల ముందు త్వరగా నిద్రలేచి అమ్మకు సహాయం చేస్తే! ఆమెకు ఇంకా చాలా సమయం ఉంటుందని నేను భావిస్తున్నాను. ఆమె కష్టపడాల్సిన అవసరం ఉండదు. ఇంటిపని చేయడం ఆమె పని మాత్రమే కాదు! కుటుంబ సభ్యులందరూ పనిని పంచుకోవాలి. ACTiZENS క్లబ్‌లో నా ఉపాధ్యాయుడు ఈ విషయాన్ని నాకు చెప్పారు.
నాయనమ్మ: అవును, నువ్వు చెప్పింది నిజమే! మనమంతా రేపు దీనిని ప్రయత్నిద్దాం.
మరుసటి రోజు - (అందరూ సాధారణం కంటే 10 నిమిషాలు ముందుగా మేల్కొంటారు)
నాయనమ్మ: కోడలా నేను నీకు కూరగాయలు కోసి ఇస్తాను.
నాన్న: నేను మొక్కలకు నీళ్ళు పోస్తాను.
పిల్లలు: మేము తాత నాయనమ్మలకు నీళ్ళు వగైరా తెచ్చియిస్తూ, స్కూల్ బ్యాగ్ సొంతంగా సర్దుకుని స్కూల్‌కి రెడీ అవుతాం.
తాత: నేను పిల్లలను స్కూల్ బస్ కోసం బస్టాప్‌లో దింపుతాను.
ప్రతి ఒక్కరూ సహాయం చేయడం ప్రారంభిస్తారు.
పనులన్నీ సజావుగా పూర్తికాసాగాయి.
అమ్మ: ఇప్పుడు ఉదయం 9:00 గంటలు అయింది, నా పని అంతా పూర్తయింది! ఈ రోజు, నాకు అదనపు సమయం ఉంది! నన్ను ఇంకా కొంచెం టీ తయారు చేయనివ్వండి, మనమంతా కలిసి ఆనందిద్దాం.