ఆంధ్రప్రదేశ్ గ్రేడ్ 6 డిసెంబర్ – జనవరి కార్యాచరణ – మాక్ ఎలక్షన్
సెషన్ లక్ష్యాలు
- విద్యార్థులు ఎన్నికల మొత్తం ప్రక్రియను అర్థం చేసుకుంటారు. మొత్తం ప్రక్రియను చర్యలు, యాక్టివిటీ అలాగే పాల్గొనడం ద్వారా అర్థం చేసుకునేలా చేయడం.
ఆశించిన ఫలితాలు.
- ప్రజాస్వామ్య విధానంలో ACTiZENS క్లబ్ పదవులకు నాయకులను ఎన్నుకోవడం.
- విద్యార్థులు చర్య, యాక్టివిటీ అలాగే నేరుగా పాల్గొనడం ద్వారా ఎన్నికల ప్రక్రియను తెలుసుకోవడానికి ఎన్నికల ప్రక్రియను అనుకరణ చేయడం.
- భారతదేశం వంటి ప్రజాస్వామ్యాలలో ఓటు వేయడం యొక్క ప్రాముఖ్యతను విద్యార్థులు అర్థం చేసుకునేలా చేయడం.
కావలసిన వస్తువులు.
తెల్ల కాగితాలు, షూ బాక్స్, బాక్స్‌కు అతికించడానికి చార్ట్ పేపర్/రంగు పేపర్లు (తప్పనిసరి కాదు), జిగురు, కత్తెర, స్కేల్, పెన్సిల్‌లు, ఎరేజర్లు, అలాగే స్కెచ్ పెన్‌లు.
సెషన్ ఓవర్వ్యూ
వ. సం. | యాక్టివిటీ ప్రక్రియ | సమయం |
సెషన్ 1 | యాక్టివిటీకి ముందు ప్లానింగ్
టీచర్ గైడెడ్ దశలు 1, 2 మరియు 3 అనుసరించాలి. గమనిక:టీచర్ విద్యార్థులను గ్రూప్‌లుగా విడదీసి, ప్రతీ గ్రూప్‌కు టాస్క్/యాక్టివిటీ పూర్తి చేయడానికి నిర్దిష్ట సమయం కేటాయించి బ్యాలెట్ బాక్స్‌లు సిద్ధం చేయడం, వోటర్ల జాబితా తయారు చేయడం వంటి టాస్క్‌లు/యాక్టివిటీలను కేటాయించాలి. |
45 నిమి |
సెషన్ 2 | తరగతి గదిలో ప్రధాన యాక్టివిటీ
టీచర్ 4, 5, 6 మరియు 7 దశలను అనుసరించాలి |
45 నిమి
|
యాక్టివిటీకి ముందు ప్లానింగ్
పీరియడ్ 1
అవసరమైన సమయం - 45 నిమిషాలు.
- వ దశ – వీడియో చూడటం
- వ దశ – ప్రశ్నలు అడగటం
- వ దశ – యాక్టివిటీ వివరించడం
ఇప్పుడు, మొదలుపెడదాం!
1. వ దశ – టీచర్ ఎన్నికలకు సంబంధించిన చిన్న వీడియోను చూపించవచ్చు. వీడియో లింక్ క్రిందన ఉంది:
భారతదేశంలో ఎన్నికల విధానం | సోషల్ స్టడీస్ ట్యుటోరియల్
గమనిక: ఒక వేళ వీడియో చూపించడం కుదరకపోతే, విద్యార్థుల కోసం వీడియో గురించి క్లుప్తంగా విద్యార్థులకు వివరించాలి.
2. వ దశ- తర్వాతి దశలో, వీడియో ఆధారంగా కొన్ని ప్రశ్నలు అడగండి. అలాంటి కొన్ని ప్రశ్నలు:
- భారతదేశంలో ఎన్నికలలో పాల్గొనడానికి ఎవరికి అర్హత ఉంటుంది?
- సాధారణ ఎన్నికలలో ఓటు వేయడానికి ఎవరికి అర్హత ఉంటుంది?
- ప్రత్యక్ష మరియు పరోక్ష ఎన్నికల మధ్య తేడాలేమిటి?
3. వ దశ – క్రింద ఇచ్చిన యాక్టివిటీని విరించండి:
- పదవులలో ఉండే వారి బాధ్యతలు మరియు పనులపై విద్యార్థులకు అవగాహన కల్పించడం. అనుబంధం 1 మరియు 2 చూడండి.
- వివిధ పదవులలో ఉన్న వారు (ACtiZENS క్లబ్ ప్రెసిడెంట్ మరియు వైస్ ప్రెసిడెంట్ వంటి) స్థానాలకు అభ్యర్థుల పేర్లను నామినేట్ చేయమని విద్యార్థులను అడగండి. అభ్యర్థులు తమను తాము నామినేట్ చేసుకోవడానికి కూడా అనుమతించండి.
- తరగతిలో అందరి ముందు తమను తాము అభ్యర్థిగా ప్రచారం చేసుకోమని విద్యార్థులకు చెప్పండి.
- ఓటర్ నమోదు – ముందస్తుగానే ఓటర్ల జాబితా సిద్ధం చేసుకుని ఎన్నికల తేదీని ప్రకటించండి.
- అభ్యర్థుల పేర్లతో ఒక బ్యాలెట్ పేపర్ అలాగే బ్యాలెట్ బాక్స్ సిద్ధం చేసుకోండి.
- విద్యార్థులను తాము ఎవరికి ఓటు వేయాలనుకుంటున్నారు, ఎందుకు అని అడిగి, ఎన్నికల రోజుకు సిద్ధమయ్యి రమ్మని చెప్పండి.
A. నమూనా బ్యాలెట్ పేపర్
2-3 మంది విద్యార్థులు/ఒక సమూహానికి ప్రతి పదవికి నామినేషన్ కోసం బ్యాలెట్ పత్రాలను తరగతి పరిమాణం ప్రకారం ప్రింటౌట్‌లు తీసుకోవడం ద్వారా లేదా కాగితం మరియు పెన్ను ఉపయోగించి మాన్యువల్‌గా తయారు చేయడం ద్వారా బ్యాలెట్ పేపర్‌లను తయారు చేయడానికి బాధ్యతను అప్పగించండి.
ఒక నమూనా క్రింద ఇవ్వబడింది:
B. ఓటర్ నమోదు కార్డ్ నమూనా
ప్రతి విద్యార్థిని ఒక చిన్న కాగితాన్ని ఉపయోగించి ‘ఓటర్ రిజిస్ట్రేషన్ కార్డ్’ని సిద్ధం చేయమని/ముద్రించమని చెప్పండి. ఓటు వేయడానికి నమోదు చేసుకోవడానికి, ప్రతి విద్యార్థి తన పేరు, తరగతి, గ్రేడ్ మరియు మీరు జోడించదలిచిన ఏదైనా ఇతర సమాచారాన్ని వ్రాసే నమూనా ఓటర్ నమోదు కార్డును పూరించాలి. పెద్దలు ఎన్నికల రోజున ఓటు వేయడానికి చాలా కాలం ముందు అధికారికంగా నమోదు చేసుకోవాలని ఈ ప్రక్రియ విద్యార్థులకు తెలియజేస్తుంది.
ఒక ఉదాహరణ కింద ఇవ్వబడింది:
C. ఓటర్ల జాబితా
ఉపాధ్యాయులు అన్ని ఓటరు నమోదు కార్డులను సేకరించి ఓటర్ల జాబితాను రూపొందిస్తారు. ప్రతి విద్యార్థికి బ్యాలెట్ ఇవ్వడానికి ముందు వారి సంతకం కోసం వారి పేరు తర్వాత ఖాళీని ఉండేలా చూసుకోండి. ఒకే ఎన్నికల సమయంలో ప్రజలు ఒక్కసారి మాత్రమే ఓటు వేయగలరని ఈ ప్రక్రియ నిర్ధారిస్తుంది అని విద్యార్థులకు తెలియజేయండి.
క్రింద ఒక ఉదాహరణ ఇవ్వబడింది:
D. బ్యాలెట్ బాక్స్
విద్యార్థుల సమూహం బ్యాలెట్ బాక్స్‌ను షూ బాక్స్ లేదా కార్డ్‌బోర్డ్ బాక్స్‌ను ఉపయోగించి పైన చిన్న చీలికతో తయారు చేయవచ్చు. వారు ఇష్టపడితే, వారు దానిని రంగు కాగితంతో కప్పి, "బ్యాలట్ బాక్స్ - యాక్టిజెన్స్ క్లబ్" అని లేబుల్ చేయవచ్చు.
హోంవర్క్: అభ్యర్థులు తమ అభ్యర్థిత్వం గురించి ఇతర విద్యార్థులకు ప్రచారం చేయవచ్చు. ఉపాధ్యాయుడు ఎన్నికల ప్రచారానికి ఎప్పటి వరకు చేసుకోవచ్చు అని ఒక నిర్దిష్ట తేదీని పేర్కొనవచ్చు.
తరగతి గదిలో చేసే యాక్టివిటీ
2వ పీరియడ్
కావలసిన సమయం - 45 నిమిషాలు.
4. వ దశ- బ్యాలెట్ బాక్స్ సెటప్ చేయండి.
5. వ దశ- రహస్య బ్యాలెట్ విధానంలో ఓటింగ్ ప్రారంభించండి.
6. వ దశ- ఓట్లు లెక్కంచి లెక్క సరిచూసకోండి, తర్వాత
7. వ దశ- ఎన్నికల ఫలితాలు ప్రకటించండి.
యాక్టివిటీ ప్రారంభిద్దాం!
4. వ దశ- బ్యాలెట్ బాక్స్ సెటప్ చేయండి.
తరగతి గదిలో ఒక మూలన బ్యాలెట్ పెట్టెను ఏర్పాటు చేయండి మరియు క్లబ్ సభ్యులందరికీ (విద్యార్థులకు) బ్యాలెట్ పత్రాలను పంపిణీ చేయండి.
5. వ దశ- రహస్య బ్యాలెట్
ప్రతీ విద్యార్థిని, ఒక సమయంలో ఒకే విద్యార్థి రహస్య బ్యాలెట్ ద్వారా ఓటు వేసేలా చేయండి.
ప్రతీ విద్యార్థి ఓటర్ల జాబితాలో తమ పేరు చూసుకుని, దాని ప్రక్కన సంతకం చేయాలి. ఆ తర్వాత విద్యార్థికి ఓటు వేయడానికి బ్యాలెట్ పేపర్ ఇస్తారు.
విద్యార్థులు రహస్యంగా చదివి బ్యాలెట్‌ని పూరించగలిగే ప్రైవేట్ ప్రాంతాన్ని సిద్ధం చేయండి. ఒక మూలలో కొన్ని డెస్క్‌లతో ఏర్పాటు చేసినా సరిపోతుంది. మరింత బాగా ఉండటానికి, మీరు ఓటరు బూత్‌ను కూడా తయారు చేయవచ్చు, దీనిలో విద్యార్థి బ్యాలెట్‌ను మరింత ప్రైవేట్‌గా పూరించవచ్చు - రిఫ్రిజిరేటర్‌ను ప్యాకింగ్ చేయడానికి ఉపయోగించే కార్డ్‌బోర్డ్ పెట్టె బూత్‌గా పని చేస్తుంది. ఇది రహస్య బ్యాలెట్ అని విద్యార్థులకు గుర్తు చేయండి మరియు వారికి నచ్చిన అభ్యర్థికి ఓటు వేయమని చెప్పండి - ఎవరూ ఎవరినీ ఓటు వేయమని (లేదా ఓటు వేయకూడదని) ఏ విధంగానూ ఒత్తిడి చేయకూడదు. విద్యార్థులు తమ ఫారమ్‌లను పూరించడం పూర్తయిన తర్వాత, వారు తమ బ్యాలెట్‌ను బ్యాలెట్ బాక్స్‌లో ఉంచవచ్చు.
ఫలితాల కాగితం ఉదాహరణ ఒకటి ఇక్కడ ఇచ్చాము:
6. వ దశ- ఓట్లు లెక్కించి, లెక్క సరి చూసుకోండి.
మీరు ప్రతి బ్యాలెట్‌ను లెక్కించేటప్పుడు, బోర్డులోని ఓట్లను లెక్కించండి (అధిక గ్రేడ్‌లలో ఉన్న విద్యార్థుల కోసం, మీరు ఓట్ల శాతాన్ని కూడా లెక్కించవచ్చు). మీరు కౌంటింగ్ పూర్తి చేసినప్పుడు, బ్యాలెట్ల సంఖ్య విద్యార్థుల సంఖ్యకు సమానంగా ఉందా లేదా అని నిర్ధారించుకోండి. అత్యధిక ఓట్లు సాధించిన అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తారు. టై ఏర్పడితే, మీరు మరో రౌండ్ ఓటింగ్ చేయవచ్చు లేదా ఉపాధ్యాయుడు అతని/ఆమె ఓటు వేయవచ్చు.
7. వ దశ- ఎన్నికల ఫలితాలను అమలు పరచండి
ఓటింగ్ యొక్క ప్రాముఖ్యత మరియు ప్రభావాన్ని విద్యార్థులకు ప్రదర్శించడానికి, ఎన్నికల ఫలితాలు మీరు చెప్పినప్పుడు అమలులోకి వచ్చేలా చూసుకోండి. ACTiZENS క్లబ్ విజేతలు మరియు పదవులు గెలుచుకున్న వారిని ప్రకటించండి మరియు వేడుకలో కొత్తగా ఎన్నికైన సభ్యులు మరియు పదవులలో ఉన్న వారికి బ్యాడ్జ్‌లను అందజేయడం ద్వారా క్లబ్‌ను అధికారికంగా ప్రారంభించండి.
అవగాహన షీట్లు, యాక్టివిటీ రిపోర్ట్ & ఫీడ్‌బ్యాక్ ఫారమ్
టీచర్లు దయచేసి ఈ అభిప్రాయ సేకరణ ఫారమ్ నింపండి, పదవులలో ఉన్న వారికి యాక్టివిటీ రిపోర్ట్ నింపమని అలాగే విద్యార్థులను తమ ఆలోచనల షీట్లను నింపమని గుర్తు చేయండి.
సూచన విభాగం
అనుబంధం 1 – పదవి కోసం ఎన్నికలలో పాల్గొనడానికి అర్హతలు
అర్హతలు –
- ACTiZEN క్లబ్ ప్రతినిధులుగా వ్యవహరించడానికి సుముఖత.
- క్లబ్ కార్యకలాపాలు నిరాటంకంగా జరిగేలా చేయడానికి క్లబ్ ప్రతినిధి.
- ప్రచార కార్యక్రమంలో భాగంగా 2–3-నిమిషాల ఉపన్యాసం ఇవ్వడం. ఆ ఉపన్యాసంలో ఈ అంశాలు ఉండవచ్చు:
- a. క్లుప్తంగా పరిచయం
- b. మీరు పదవి చేపట్టాలి అనుకోవడానికి కారణాలు.
- c. ఇతర విద్యార్థులు మీకు ఎందుకు ఓటు వేయాలో వివరించే రెండు మూడు ప్రధాన కారణాలు.
- d. మీరు పదవికి ఎన్నికైనట్లయితే, ACTiZEN క్లబ్‌కు పరిమితమైన ఈ పాత్రకు మీరు ఎలా సహకరిస్తారో స్పష్టంగా షేర్ చేయండి.
ప్రచారంలో భాగంగా, సెషన్ 1లో యాక్టివిటీ తర్వాత అభ్యర్థులు ఇది కూడా చేయవచ్చు: (ఈ కార్యక్రమం తప్పని సరిగా చేయాల్సినది కాదు, కానీ ఉపాధ్యాయులు విద్యార్థులకు ఈ ఆలోచన చెప్పవచ్చు)
- తమ ప్రచారం కోసం పోస్టర్ తయారు చేయడం – దానిలో ఎవరైనా మీకు ఎందుకు ఓటు వేయాలో ఉండవచ్చు (మీరు దానిని మీ ఉపాధ్యాయుల అనుమతితో తరగతి నోటీసు బోర్డ్‌లో ప్రదర్శించవచ్చు)
- ప్రచార నినాదం వ్రాయడం
- ఇతరులతో మాట్లాడటం అంటే, మరిన్ని ఓట్ల కోసం ఇతరలను ఆకర్షించడానికి.
అనుబంధం 2 – పదవులలో ఉన్న వారి బాధ్యతలు చేయాల్సిన పనులు
అభ్యర్థులు చేయవలసిన పనులు & బాధ్యతలు ప్రారంభంలో స్పష్టంగా ఉండాలి.
1. అధ్యక్షులు –
- క్లబ్ తరఫున ప్రాతినిధ్యం వహించడం
- కార్యకలాపాలు నిర్వహించడంలో ఉపాధ్యాయులకు మద్దతు.
- క్లాస్ నోటీసు బోర్డ్ & దేశ్ అప్నాయెన్ వాల్‌లో చార్ట్‌లు/కళాత్మకత/విద్యార్థి భాగస్వామ్యాన్ని ప్రదర్శించడం. నెలవారీ ప్రాతిపదికన చేయాలి.
- నివేదికలు సకాలంలో సమర్పించేలా ఉపాధ్యక్షులకు మద్దతు ఇవ్వడం.
- స్కూల్ అసెంబ్లీ లేదా ఫంక్షన్ సమయంలో వారి కార్యాచరణ అనుభవాలను పంచుకునేలా విద్యార్థులను ప్రోత్సహించడం. SPOC టీచర్ సమయాన్ని గుర్తించడంలో సహాయం చేయడం మరియు ఈ ప్రదర్శనను సులభతరం చేయడం. పాఠశాలల్లోని తరగతుల సంఖ్య ప్రకారం SPOC ఉపాధ్యాయునిచే నిర్ణయించబడేలా కనీసం త్రైమాసికం/పాఠశాల సంవత్సరంలో ఒకసారి చేయాలి.
- ఫార్మాట్ ప్రకారం ప్రతి నెలా నెలవారీ కార్యాచరణ నివేదికను సమర్పించడం
2. ఉప – అధ్యక్షులు –
- క్లబ్ యొక్క ప్రాతినిధ్యం మరియు అధ్యక్షుడికి మద్దతు.
- యాక్టివిటీ నివేదికలు సకాలంలో సమర్పించేలా చూసుకోవడం. అప్‌లోడ్ చేయడానికి రిఫ్లెక్షన్ షీట్‌లను సేకరించడానికి & కంపైల్ చేయడానికి సహాయం చేయడం.
- క్లాస్ నోటీసు బోర్డు & దేశ్ అప్నాయెన్ వాల్‌లో చార్ట్‌లు/ఆర్ట్‌వర్క్/ విద్యార్థుల భాగస్వామ్యాన్ని ప్రదర్శించడంలో అధ్యక్షునికి మద్దతు ఇవ్వడం.
- క్లబ్ సభ్యులు మరియు సంబంధిత ఉపాధ్యాయుల మధ్య సమన్వయం ఉండేలా చూసుకోవడం
- ఫార్మాట్ ప్రకారం ప్రతి నెలా నెలవారీ కార్యాచరణ నివేదికను సమర్పించడం
ముద్రణ సెక్షన్